వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు దేశ తండ లో డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరంసోత్ రెడ్యానాయక్ గెలుపు కోసం ‘గడప గడపకు’ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. ఆదివారం నేతలు ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర రవి నాయక్ , మాజీ ODCMS చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ రాంలాల్, 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు, 10వ వార్డ్ కౌన్సిలర్ బాదావత్ హతిరామ్, 5వ వార్డు కౌన్సిలర్ సుజాత వెంకన్న, 15వ వార్డు కౌన్సిలర్ కౌసల్య గణేష్ , నాయకులు బాలాజీ నాయక్, బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
