వేద న్యూస్, పాపన్నపేట:
పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన పొట్లోళ్ల ఆశయ్య నిన్న రాత్రి మరణించడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని… ఆశయ్య మృతి పట్ల సానుభూతి తెలియజేస్తూ, దహన సంస్కారాల కోసం రూ.5000(ఐదు వేలు) రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మన్నే వెంకటేశం, సిద్దిరామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ స్రవంతి శ్రీనివాస్ కె. రాజయ్యసార్, బాల్ రెడ్డి సార్, మాజీ ఉప సర్పంచ్ పోతాగౌడ్,మోహన్ రావు,వార్డ్ మెంబర్ రాజు, వడ్ల మధు,కిరణ్ పుట్టి,కంది అభి,కదూరి మోహన్,సంజీవులు టి స్ పి డి సి ల్, ఆర్కెలా విల్సన్, రఫీయొద్దీన్ మన్నే దత్తు బొబ్బిడి సంతు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.