వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. ఆదివారం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో, పథకాలు ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఎవ్వరూ చేయని విధంగా కేసీఆర్ వరాల జల్లు కురిపించడం పట్ల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా ఇంతకుముందు పథకాలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ మేనిఫెస్టో ప్రకటించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మండల నాయకులు కోరారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గత పది సంవత్సరాల నుంచి ఎలిగేడు మండలం ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అత్యధిక మెజార్టీతో మనోహర్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలను మండల నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తాడిపర్తి స్రవంతి మోహన్ రావు, జెడ్పిటిసి మండల రేణుక రాజనర్సు, మండల పార్టీ అధ్యక్షుడు రామ్ రెడ్డి, అన్ని గ్రామాల అధ్యక్షులు, ప్రజలు నాయకులు పాల్గొన్నారు.