– రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తీర్మానం
– ఆర్‌వీని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే సహకారమిస్తామని ప్రకటన
– మలిదశ ఉద్యమకారులను గుర్తించి, గౌరవించాలని డిమాండ్
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/బేగంపేట:
బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ అభ్యర్థిగా ఉద్యమనేత, గులాబీ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ వీ మహేందర్ కుమార్ ను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం సిటీ కమిటీ అధ్యక్షులు ఆర్ వీ మహేందర్ కుమార్ ను గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడైన మహేందర్ కుమార్ ను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
మలిదశ ఉద్యమకారులను కేసీఆర్ గౌరవించాలని, గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్ వీ మహేందర్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించినట్లయితే మున్నూరు కాపు సంఘం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు కె.వి.ఆర్, బోరిగం రాజారాం తదితరులు పాల్గొన్నారు.