• -ఆ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్

వేద న్యూస్, మరిపెడ:
రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మరిపెడ మండలం ఎడ్జర్ల గ్రామంలో సమన్వయ సమావేశం జరిగింది.

ఈ మీటింగ్ కు ఆయన, స్త్రీ- శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, నాయకులు బండి వెంకటరెడ్డి, రంగారెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా గులాబీ సర్కార్ పని చేసిందని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం ఖాయమని పేర్కొన్నారు.