• పంతులుపల్లి పాఠశాల 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
  • తొలి జీతంతో పాఠశాల క్యాలెండర్ రూపొందించిన టీచర్‌కు అధికారుల సన్మానం 

వేద న్యూస్, నల్లబెల్లి :

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామంలోని పంతులపల్లి ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల  నూతన సంవత్సర క్యాలెండర్ -2025 ఆవిష్కరణ కార్యక్రమం  శుక్రవారం నిర్వహించారు. స్థానిక పాఠశాల హెడ్ మా స్టర్ కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపిడిఓ జి.నరసింహమూర్తి, ఎంఈఓ అంబి వసంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపిడిఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఫొ టోలతో క్యాలెండర్ లను తయారుచేయించడమే కాకుండా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

నూతనంగా ఉపాధ్యాయుడిగా నియామకమై, తాను తీసుకున్న మొదటి జీతం నుంచి క్యాలెండర్స్ అందజేసిన ఉపాధ్యాయుడు రాజన్ బాబు ను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించి, ఆశీర్వదించారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్లు గోనె శ్రీదేవి, ఆసం చంద్రమౌళి, నాగరాజుపల్లి,మామిండ్లవీరయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శులు డాక్టర్ విష్ణు, సుధాకర్, పాఠశాల సహోపాధ్యాయులు పిఆర్ టియు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నకిరెడ్డి మహేందర్, ఉడుత రాజేందర్, కునమల్ల రాజన్ బాబు, అశోక్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.