•  టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి

వేద న్యూస్, ఓరుగల్లు: 

పట్టభద్రులంతా ఐక్యంగా ఉండి, మన వరంగల్ ముద్దుబిడ్డ ,ఉన్నత విద్యావంతుడు, మేధావి, సేవా తత్వరుడు అయినా ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆదేశానుసారం గత పది రోజుల నుండి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మూడు టీములు రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో కరపత్రాలు పంచుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారన్నారు.

 

రాకేష్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రవీందర్ రెడ్డి, శివ,రాకేష్,విజయ్, సతీష్, ప్రేమ్ సాగర్ రావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.