వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు ఆధ్వర్యంలో 218 పోలింగ్ బూత్ పరిధిలోని ఎస్సీ కాలనీలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఈవీఎంలతో రెడ్యానాయక్ గెలుపు కోసం ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
