వేద న్యూస్, వరంగల్:
నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే వాహనంతో పాటు సిబ్బందిని పిలిపించారు. కుక్కల కోసం డివిజన్లోని పలు గల్లీలో సుమారు మూడు గంటల పాటు శ్రమించి కుక్కలు పట్టే సిబ్బందితో కలిసి ఎట్టకేలకు కుక్కలను పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కుక్కల బెదడ నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం కలిగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.