వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్పెషల్ గ్రాంట్స్ నుంచి కొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ బుధవారం పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ ప్రజల కష్టాలు, వారి అవసరాలు తీర్చడానికి ఎల్లవేళలా ముందుంటుందని పేర్కొనడానికి.. ఈ స్పెషల్ గ్రాంట్స్ నిదర్శనం అని వెల్లడించారు. కార్యక్రమంలో కమలం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, వెంకటేష్ యాదవ్, చిదురాల వెంకటేష్, ప్రణయ్, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.