వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ రోజున భీమవరం గ్రామంలోని స్థానిక ఈదుగా వద్ద నల్ల రంగు రిబ్బన్ చేతికి ధరించి నిరసనకు ముస్లింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. ఇది సవరణ కాదు సేకరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుగా ఉందని దీన్ని బే షరతుగా వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం మత పెద్దలు మైనార్టీ సోదరులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేశారు.