వేద న్యూస్, మెదక్:
మక్కరాజీపేట్ జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (ఎఫ్ ఎస్ టీ) తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దాచారం గ్రామం, గజ్వేల్ మండలానికి చెందిన దంపతులు గుండెల్లి సిరిష మరియు యాదగిరి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా, వారి వద్ద ఉన్న సరైన పత్రాలు లేని రూ.30,59,500 నగదును పోలీసులు గుర్తించారు. నగదు గురించి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి, స్వాధీనం చేసిన నగదును తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణా, ఓటర్లను ప్రలోభపరచే ప్రయత్నాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.