వేదన్యూస్ -చెపాక్
చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతులేత్తేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ 51బంతుల్లో 77పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది.
ఢిల్లీ బ్యాటర్స్ లో అభిషేక్ 20బంతుల్లో 33పరుగులు .. స్టబ్స్ 12బంతుల్లో 24పరుగులతో నాటౌట్ రాణించగా పూర్తి ఓవర్లు ఆడి 6వికెట్లను కోల్పోయి 183 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 25/2, జడేజా 1/19,మతీష 1/31 రాణించారు.
184పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై విజయ్ శంకర్ 69*(54) ,శివమ్ దూభే 18(15), చివర్లో ఎంఎస్ ధోనీ 30*(26)రాణించడంతో గౌరవప్రధమైన స్కోరు 158/5 చేసింది. ఢిల్లీపై ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లల్లో విప్పరాజ్ 2/27రాణించాడు.