వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మొదటి వార్షికోత్సవ కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు డింగరి ప్రవీణాచార్యులు, ఏలుబాక ఫణి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు ఆకుల రాజేందర్, ఆకుల మహేందర్, స్థానిక కౌన్సిలర్ భోగం సుగుణ, దయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
గతేడాది జనవరి 24న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ప్రాణపతిష్ట చేసుకుని సంవత్సర కాలం పూర్తిచేసుకుని..అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వచ్చే నెల(ఫిబ్రవరి) 10, 11, 12, 14 తేదీల్లో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని ఫణి శర్మ తెలిపారు. కార్యక్రమంలో అమృత హాస్పిటల్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, భోగం వెంకటేష్, ముదాం తిరుపతి, మధు,ఆకుల సాయిలు, కైలాసకోటి సమ్మయ్య, గుర్రపు శ్రీకాంత్, కైలాసకోటి గణేష్, పోడేటి అనిల్, గుర్రపు ప్రవీణ్, సాదుల కిరణ్, ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.