వేద న్యూస్, శాయంపేట :
భూపాలపల్లి నియోజకర్గం శాయంపేట మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామంలోని మంచి నీటి బావి వద్ద రూ.2.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
అనంతరం శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 24 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.7,03,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుదిపాల బుచ్చిరెడ్డి, తెలంగాణ మినిమం వెజ్ బోర్డ్ మెంబర్ బాసాని చంద్రప్రకాష్, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, జిల్లా నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రావిపాల్, INTUC మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్, నాయకులు చిందం రవి, బాసని మార్కండేయ, బాసని రవి, మారపెళ్లి కట్టయ్య తదితరులు పాల్గోన్నారు.