వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి మండల ఎమ్మార్వో, ఎంపీడీవో ఆదేశానుసారము గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది తూర్పు ద్వారము ఎదుట., ఇంటి మెయిన్ బజార్ ఎదుట సుచి..శుభ్రంగా ఉండేందుకు ప్రతీ రోజు నాలుగు సార్లు శుద్ధి చేశారు. చెత్త పేరుకు పోకుండా పారిశుధ్య కార్మికులు వెంట వెంటనే చెత్తను తొలగించి రోడ్లన్నీ శుభ్రపరిచారు.

భక్తులకు మంచి సౌకర్యవంతంగా ఉండేందుకు రోడ్లను ఊడ్చి వారి ఆరోగ్యానికి తోడ్పాటు అందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మొగిలిపాలెం రాంబాబు సన్మానించారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని..దుమ్ము దులిలో వారికి చాలీచాలని జీతంతో సేవలందించారని కొనియాడారు.

కష్టజీవుల కష్టాన్ని జాతరలో శ్రమతో ఇబ్బంది పడకుండా ‘‘మానవసేవే మాధవసేవ’’ అనే నానుడికి అనుసంధానంగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఎంతో ఓర్పుతో జాతరలో విసుగు చెందకుండా తమ సేవలు అందించారు.

కష్టమైనా ఓర్పుతో వారికి అప్పజెప్పిన ప్రత్యేక జాతర విధులను నిర్వర్తించిన గ్రామపంచాయతీ సిబ్బందికి తన వంతుగా వాళ్ల కృషిని కొనియాడి.., గుర్తించి శాలువతో సన్మానించినట్లు మొగిలిపాలెం రాంబాబు బుధవారం తెలిపారు. పారిశుధ్య సిబ్బందికి ఆయన స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా..ప్రజాసేవలో గ్రామ సేవలో సుభిక్షంగా ఉండాలని, వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి ఆశీస్సులు ఉండాలని ఆశీర్వాదములు అందజేశారు.

కొత్తకొండ గ్రామపంచాయతీ మాజీ కార్యదర్శి, స్పెషల్ డ్యూటీ పై జాతరకు వచ్చిన భాస్కర్.. విధులపై శ్రద్ధ వహించారని చెప్పారు. సిబ్బంది వెంట ఉండి ఎప్పటికీ నీటుగా శుభ్రం చేయించే బాధ్యతను తీసుకున్నందుకు వారిని కొనియాడుతూ.. సన్మానించి ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనము అందజేశారు.