వేద న్యూస్, ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సోమవారం
జెడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో
చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.దీనిలో భాగంగా ,
మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ, మాట్లాడుతూ బాల్య వివాహలను ప్రోత్సహంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేసారు. బాల్య వివాహల వల్ల కలిగే అనర్ధాలపై గ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే ఎలాంటి శిక్షలు పడతాయో వారికి వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్100, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181, జాతీయ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ 112, అత్యవసర వైద్య హెల్ప్ లైన్ నెంబర్108, ఆపదలో ఉన్న అమ్మాయి హెల్ప్ లైన్ నెంబర్ 8712670783,సైబర్ నేరాలు హెల్ప్ లైన్ నెంబర్ 1930, దివ్యాంగుల హెల్ప్ లైన్ నెంబర్ 155326, వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567 లా గురించి అవగాహన కల్పించడం జరిగింది.బాల్య వివాహాలు జరగకుండా ఉండేందుకు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
మహిళా సాధికారత సిబ్బంది
హేమశ్రీ, చైల్డ్ హెల్ప్ లైన్ శ్రీకాంత్,ఎం ఎల్ హేచ్ పి గణేష్,
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి రాజేందర్,పాఠశాల బృందం,
తల్లులు కిశోర బాలికలు గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్స్ ,ఆశా కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.