వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు. అనంతరం హెచ్ఎం అనంతరావు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చాచాజీని ఆదర్శంగా తీసుకొని చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనము, ఉపన్యాసం, వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. పోటీల విజేతలకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ కార్యదర్శి రామ్మోహన్ బయగాని , ఉపాధ్యాయులు జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, ప్రసాదరావు, సారయ్య, జహేదా బేగం, సురేష్, బాబురావు, అనిత, సుధా, మంజుశ్రీ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.