- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్, జమ్మికుంట :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనప్పటికీ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నియమించలేదని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించి కాపాడేందుకు తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.