వేద న్యూస్, జనగాం:

జనగాం జిల్లాలో గాయపడిన ఒక వ్యక్తి విషయం జనగాం జిల్లా కలెక్టర్ కు శ్రావణ్ కుమార్ ట్వీట్ చేయగా వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి.. మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, గాయపడిన వ్యక్తికి అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు.

బాధితుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.

ప్రజల సమస్యలపై తక్షణ స్పందన చూపుతూ, బాధితులకు సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జిల్లా పరిపాలన బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం ముఖ్యమని, ఇలాంటి ఘటనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కలెక్టర్ తక్షణ స్పందనతో బాధితుడికి సమయానికి చికిత్స అందడంతో స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ప్రజల సమస్యలపై స్పందించే కలెక్టర్ తమ జిల్లాకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *