•  పనులు ప్రారంభించిన ఇందిరానగర్ మాజీ సర్పంచ్ శారద ప్రవీణ్
  • శారద ప్రవీణ్  దంపతులకు రుణపడి ఉంటాం: గంగిరెద్దుల కులస్తులు

వేద న్యూస్, జమ్మికుంట:

రాష్ట్రంలోనే తొలి గంగిరెద్దుల కమిటీ హాల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన పనులను శుక్రవారం శాలపల్లి – ఇందిరా నగర్ గ్రామం లో మాజీ సర్పంచ్ కోడి గూటి శారద ప్రవీణ్ ప్రారంభించారు.

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కోసం 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ పనులు షురూ చేశారు.

 ఈ సందర్భంగా కోడిగుటి శారద ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, త్వరలోనే ఈ కమిటీ హాల్ పూర్తవుతుందని శారదా ప్రవీణ్ తెలిపారు.

గంగిరెద్దుల కుల బాంధవుల కోసం నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషిచేసిన మాజీ సర్పంచ్ కోడిగూ టి శారద ప్రవీణ్ దంపతులకు గంగిరెద్దుల కుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో గంగిరెద్దుల కమిటీ హాల్ లేవు. కాగా రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గంగిరెద్దులకు కమిటీ హాల్ నిర్మించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల కులస్తులు మాజీ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తమ అవసరాలను గుర్తించి కమిటీ హాల్ నిర్మాణానికి చొరవ చూపిన మాజీ సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు.