వేద న్యూస్, శాయంపేట :
భోగి పండుగ సందర్భంగా శాయంపేట గ్రామంలో కుమ్మరి వీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి నిర్వాహకుడు బెరుగు తరుణ్ గోపి విజేతలకు ప్రోత్సాహకము అందించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలదాసు చంద్రమౌళి, బాసాని సాయి, ఏనుగుల శ్రావణ్, మామిడి సురేష్, గిద్దమారి సురేష్, ఉప్పునూతల మణికేష్, ఉప్పు రమేష్, గొలుసు చరణ్, డీజే సమీర్, బాసాని వినయ్, రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.