వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు అంకుషాపూర్ గ్రామస్తుడు చెల్పూరి రాములు ఫిర్యాదు చేశారు. రాములు తెలిపిన వివరాల ప్రకారం..సమాచారం కోసం 19-02-2022న సమాచార హక్కు చట్టం( 2005) సెక్షన్ 6(1) ప్రకారం జమ్మికుంట మండల వ్యవసాయ అధికారిని ఓ విషయమై సమాచారం కోరారు.
సదరు సమాచారంలో 4 నాలుగు సంవత్సరాల ఖర్చుల వివరాలు అడిగితే..కేవలం ఒక సంవత్సరం వివరాలు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన ఆ వివరాలలో తప్పుడు బిల్లులు పెట్టి, డబ్బులు కాజేసినట్లు రాములు ఆరోపించారు. ఆ డబ్బులను రికవరీ చేయాలని, అధికారిపై శాఖపరమైన తగు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు రాతపూర్వకముగా ఫిర్యాదు చేసినట్లుగా రాములు చెల్పూరి గురువారం వెల్లడించారు.