వేద న్యూస్, జమ్మికుంట:

ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో
కంప్యూటర్ కోర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
ప్ గత రెండు నెలలుగా కంప్యూటర్ విభాగం నిర్వహించిన కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎంఎస్ ఎక్సెల్ , ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్లలో విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న 65 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్, అధ్యాపకులు చ సర్టిఫికెట్స్ అందజేశారు.

 

 

ప్కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమేష్  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిత్యం నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అకాడమిక్స్ తో పాటుగా కంప్యూటర్ కోర్స్ లలో నైపుణ్యం పెంచుకున్న , విద్యార్థిని విద్యార్థులు జీవితంలో త్వరగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఓదెలు కుమార్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రం కంప్యూటర్ విభాగం ఇంచార్జ్ వి కిరణ్ కుమార్, టి ఎస్ కే సి కోఆర్డినేటర్ ఉమా కిరణ్, డాక్టర్ మాధవి, డాక్టర్ శ్యామల, రాజుకుమార్, కంప్యూటర్ అధ్యాపకులు డాక్టర్ సుష్మ,డాక్టర్ రవి ప్రకాష్ రావు, ఎస్ రమేష్ మరియు డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని వారి అమూల్యమైన సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.

 

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్