- వరంగల్ జిల్లా ఎస్సీ /ఎస్టీఅట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ , దళితరత్న చిన్న స్వామి నమిండ్ల
వేద న్యూస్, వరంగల్:
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై న్యాయవాది చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ .. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన దాడిగా కాకుండా మనువాదం ముసుగులో జరిగిన దాడిగా భావిస్తున్నామని దళితరత్న చిన్న స్వామినమిండ్ల తెలిపారు.

ఈ దేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానా ప్రధాన న్యాయమూర్తికే భద్రత కల్పించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనేది దేశ ప్రజలు గమనించాలన్నారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందనీ , ఈ దేశంలో దళిత బహుజనులకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా ? అని ప్రశ్నిం చారు.
వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి దోషిని కఠినంగా శిక్షించాలని కోరారు.