వేద న్యూస్, సుల్తానాబాద్:
ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో రాణిస్తున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. 70వ మహిళల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అఖిలశ్రీ అనే క్రీడాకారిణి ఆల్ఫోస్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ వారిని ఆయ రంగాల్లో నిష్ణాతులైన శిక్షకులచే శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిత్య శిక్షణతో ఆయా రంగంలో వారిని ప్రోత్సహించడంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్న అఖిలశ్రీని అభినందిస్తూ భవిష్యత్తులో జాతీయస్థాయిలో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
