వేద న్యూస్, హన్మకొండ:
కాజీపేట క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ప్రత్యేక ప్రార్థనల్లో యువ నాయకుడు విష్ణు వర్థన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం కాజీపేట్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి హజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా పశ్చిమ నియోజకవర్గం యువత విష్ణు వర్ధన్ రెడ్డిని పూల మాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ నిర్వాహకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.