వేద న్యూస్, డెస్క్:
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండలంలో దందాలకు తెరలేపుతున్నారని విమర్శిస్తున్న క్రమంలో రాయడానికి వీలు లేని అసభ్యకర పదజాలంతో దూషించారు. గులాబీ పార్టీ కార్యకర్తలను కత్తెర బ్యాచులు, చెడ్డి గ్యాంగ్ బ్యాచులు అని పేర్కొంటూ పలు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గులాబీ పార్టీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నాయకుడు