వేద న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ఇందిరా మహిళాశక్తి సభ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లాయి. మంగళవారం జరగనున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
నెక్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరుతుండగా, పచ్చ జెండా ఊపి ర్యాలీని టీపీ సీ సీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భక్కి అశోక్,పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి సాయికృష్ణ,కుసుమ చెన్నకేశవులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ వివిధ గ్రామాల అధ్యక్షులు,కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.