వేద న్యూస్, నెక్కొండ:
నెక్కొండ సీఐగా బదిలీపై వచ్చిన చంద్రమోహన్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ మాజీ ఎంపీపీ ఆవుల చంద్రయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు మాదటీ శ్రీనివాస్, చల్ల పాపి రెడ్డి, మెరుగు విజయ్, మండల యూత్ కాంగ్రెస్అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.