- కాంగ్రెస్ పార్టీ 50 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ అప్సర్ పాషా
వేద న్యూస్, హన్మకొండ :
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని వరంగల్ పశ్చిమ నియోజవర్గ పరిధిలోని 50 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ అప్సర్ పాషా అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సయ్యద్ అప్సర్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం సయ్యద్ అప్సర్ పాషా మాట్లాడుతూ సంక్షేమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే అమలుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్ మొహమ్మద్ బషీర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మజీద్ మీర్జా డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్, మొహమ్మద్ ఫయాజ్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్, మొహమ్మద్ ఇర్ఫాన్ డివిజన్ సెక్రెటరీ, రాము డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, కిషన్ మూర్తి డివిజన్ సోషల్ మీడియా ఇంచార్జ్ , నిఖిల్ ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.