వేద న్యూస్, వరంగల్ :
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన కల్పించినట్లు ఆ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణపై ప్రతీ ఒక్క కుటుంబానికీ కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారని, ఈ క్రమంలో దరఖాస్తుదారులతో కలిసి అప్లికేషన్స్ ఇచ్చారని వెల్లడించారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో నాయకులు రాందేవ్, మాజీ కార్పొరేటర్ బత్తిని వసుంధర, అఖిల్, నవీన్, రాజేశ్, చందు, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.