- బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
- యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్
వేద న్యూస్, ఎల్కతుర్తి:
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హింగే శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఆ కక్ష సాధింపులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయించిందని తెలిపారు.
కేంద్రంలోని కాషాయ పార్టీ వ్యవస్థీకతంగా ఎన్ని దాడులకు పాల్పడినా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడై తల ఇంత చందా రూపంలో వేసుకొని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తారని వెల్లడించారు. ఈ దేశాన్ని మరోసారి మోడీకి కట్టబెట్టినైతే దేశం ప్రమాద అంచులోకి వెళుతుందని ఎంతోమంది మేధావులు అంచనా వేసే..మోడీ ప్రభుత్వానికి ఓట్లు వేయొద్దని సభలు, సమావేశాలు పెడుతున్నారని వివరించారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబాల శ్రీకాంత్, ఎర్రోళ్ల చైతన్య కుమార్, యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మండ సుమన్ గౌడ్, అంబాల జగన్, సిద్దు, గొడిశాల ప్రదీప్, ప్రణవ్, బొంకూరి క్రాంతి కుమార్, ఈర భీమ్రాజ్, కార్తీక్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
========