• పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొల్లు బాబు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
నేడు(గురువారం) జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు యేముల పుష్పలతలు కోరారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభావేదికకు చేరుకుంటారని తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, ఓటర్లు. అభిమానులు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయభేరి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర రవీందర్, బీసీ సెల్ అసెంబ్లీ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మహిపాల్. ఎర్ర రమేష్, గంట కుమార్. ఎర్ర శ్రీను. రియాజ్ తదితరులు పాల్గొన్నారు.