వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:

వికలాంగుల హక్కుల పోరాట సమితి మిర్యాలగూడ నియోజకవర్గం స్థాయి సమావేశంను మిర్యాలగూడ పట్టణం ఆర్య సమాజ్ మందిరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎండి అహ్మద్ ఖాన్ అధ్యక్షతన జరిగినది. ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఎన్నికల సమయం ఇచ్చిన హామీలు వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేయిత పెన్షన్ 4000 రూపాయలు వికలాంగుల 2016 చట్టం వికలాంగులకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని, వికలాంగులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తామని నేటి వరకు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేయిత పెన్షన్ 4000 రూపాయలు,తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులకు 15 వేల రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జీవో ఉన్న నల్లగొండ జిల్లాలో జిల్లా అధికారులు ఒక్క వికలాంగులు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అర్హులైన వికలాంగులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,వికలాంగులకు చేయూత పెన్షన్ దార్లకు, కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తారీకు సోమవారం నాడు వికలాంగులు చేయూత పెన్షన్ దార్ల జిల్లా సదస్సు నలగొండ జిల్లా కేంద్రంలో సమావేశం జరుగుతుంది.ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్నారు కావున నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామం నుండి వికలాంగులు,వృద్ధులు వంటరి మహిళలు,వితంతువులు,చేనేత కార్మికులు,గీత కార్మికులు హెచ్ఐవి బాధ్యతలు ప్రతి ఒక్కరు చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సుకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు దైద సత్యం ,మాదిగ బిజెపి జనరల్ సెక్రెటరీ ఎడ్ల రమేష్,విహెచ్పిఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్య రెడ్డి,మాజీ కౌన్సిలర్ దైద వెంకటేశ్వర్లు, ఎంఐఎం పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఫరూక్,విహెచ్పిఎస్ జిల్లా నాయకులు వీరబోయిన సైదులు, మద్దికుంట్ల మాధవరెడ్డి, మదన్నాయక్,పాల్వాయి సుధాకర్,ఎండి గఫార్,పుట్టల నగేష్,శీలం సైదులు,నసీరుద్దీన్ బాబా, రాచూరి సైదులు,ఎండి ఇబ్రహీం,నరసింహ,ఎండి కలీం,బుడవాత్ రవి నాయక్,వెంకన్న,సురేష్, సతీష్,ఎమ్మార్పీఎస్ నాయకులు ఉబ్బపళ్లి నగేష్,వి ఎల్లయ్య,ఆర్.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.