వేద న్యూస్, వరంగల్ :

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 68.86 శాతం పోలింగ్ నమోదయ్యిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. మొత్తం 18,24,466 మంది ఓటర్లకు గాను 12,56,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,29,512 ఉండగా, పురుష ఓటర్లు 6,26,704 మంది, ఇతరులు 85 మంది ఓటు వేశారని అన్నారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ ను పరిశీలిస్తే, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం 2,54,110 మంది ఓటర్లకు గాను 2,00,158 ఓటర్లు (78.77 శాతం) ఓటు హక్కు వినియోగించు కున్నారని, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,55,524 మంది ఓటర్లకు గాను 1,82,515 ఓటర్లు (71.43 శాతం), పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,22,383 మంది ఓటర్లకు గాను 1,70,916 ఓటర్లు (76.86 శాతం), వరంగల్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,83,446 మంది ఓటర్లకు గాను 1,49,320 ఓటర్లు (52.68 శాతం), వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,58,495 మంది ఓటర్లకు గాను 1,68,234 ఓటర్లు (65.08 శాతం), వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,73,766 మంది ఓటర్లకు గాను 1,97,763 ఓటర్లు (72.24 శాతం), భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,76,752 మంది ఓటర్లకు గాను 1,87,395 ఓటర్లు (67.71 శాతం) తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని కలెక్టర్ వివరించారు. అందరి సహకారంతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని, ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన ఓటర్లకు, ప్రజలకు భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ అభినందించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడం లో సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల సమాచారం ఎప్పటికపుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు.