వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
హుజూరాబాద్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం హుజురాబాద్ కు వచ్చారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో టీడీపీలో గుర్రం వెంకటేశ్వర్లుతో పని చేసిన అనుభవాన్ని మంత్రి సీతక్క గుర్తు చేసుకుని సంతాపం వ్యక్తపరిచారు. మంత్రి సీతక్క వెంట గుర్రం కుటుంబ సభ్యులతో పాటు కుమారులు గుర్రం హరిబాబు, గుర్రం కళ్యాణ్..కాంగ్రెస్ పార్టీ నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, బాషవేని రాజేష్,నల్లగొని రాకేష్,చల్లూరి విష్ణు వర్ధన్,చెంచల మణిదీప్ తదితరులున్నారు.