వేద న్యూస్, జమ్మికుంట:
బుధవారం విద్యుత్ వినియోగదారుల సదస్సు జమ్మికుంట సబ్ డివిజన్ ఆఫీస్‌లో ఉదయం 10:30 నుండి 01 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇల్లంతకుంట అసిస్టెంట్ ఇంజనీర్ సుష్మ సోమవారం ఓ ప్రకటనతో తెలిపారు.
ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల పెంపుదల వినియోగదారులు, రైతులకు సంబంధించి వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు.
సదస్సులో కన్జ్యూమర్ గ్రీవెన్స్ చైర్మన్ వేణుగోపాల చారి , మెంబర్ టెక్నికల్ ర మేష్, మెంబర్ ఫైనాన్స్ దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు పాల్గొంటారని వెల్లడించారు.