వేద న్యూస్, వరంగల్ టౌన్:
తూర్పు కోట హనుమాన్ సెంటర్‌లో నూతనంగా ఆటో డ్రైవర్స్ ఏర్పాటు చేసుకున్న అంజనీ పుత్ర ఆటో యూనియన్ అడ్డాను ఆటో కార్మికులతో కలిసి గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమవారం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తూర్పు కోట ఆటో కార్మికులు ఎంతో ఐక్యంగా ఉంటూ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలతో కలిసిపోయి వారికి అండగా ఉంటున్నారని ప్రశంసించారు.
నూతనంగా అడ్డా ఏర్పాటు చేసుకొని అలాగే నూతన కమిటీ వేసుకున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డ్రైవర్స్ ప్రయణంలో జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ కలిగి ఉండి, ఇన్సూరెన్స్, భద్రత పాటించాలని కోరారు. ఆలాగే ప్రయాణికులు కూడా డ్రైవర్స్‌కు సహకరించి గమ్యాస్థానానికి చేరాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సంగరబోయిన చందర్, వనపర్తి కర్ణాకర్, బేర వేణు,మన తాడు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఈసంపెల్లి సంజీవ, కార్యదర్శి బాబులతో పాటు నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు సంగరబోయిన ప్రభాకర్, నూతన అధ్యక్షులు సంగరబోయిన రాజు, ప్రధానకార్యదర్శి మంద శ్రీధర్ రెడ్డి, కోశాధికారి కోడూరి యాకుబ్, ఉపాధ్యకులు సిరబోయిన శివమ్, సహాయ కార్యదర్శి సంగరబోయిన శివ తదితరులు పాల్గొన్నారు.