వేద న్యూస్, గంగాధర:
‘సైబర్ జాగ్రూక్త దివస్’ సందర్భంగా గంగాధర మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ ఇంటర్మీడియట్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాధర ఎస్సై వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. రోజు రోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఇలాంటివి వాటిపైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వ్యాపారం, పెట్టుబడి మోసాలు, పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు, గుర్తింపు దొంగతనం, క్రెడిట్ కార్డుల దుర్వినియోగం, నకిలీ రుణ యాప్లు, రుణ మోసాలు, ఆన్లైన్ షాపింగ్ లో వస్తువులు డెలివరీ కాకపోవడం, ఇలా పలు మోసాల రూపాలను వివరించారు.
ఆన్లైన్ భద్రతా చిట్కాలు గురించి విద్యార్థులకు సూచనలు చేశారు. డిజిటల్ ప్రపంచంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.