- ఏఐఎస్ బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్
వేద న్యూస్, వరంగల్:
నూతనంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు సెమిస్టర్ లకు 50 శాతం సబ్జెక్టులు పాస్ కావాలని తీసుకొచ్చిన నిబంధనలను విరమించుకోవాలని ఏఐఎస్ బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ యూనివర్సిటీ పాలకవర్గం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టి వేసే పరిస్థితి ఏర్పడిందని ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీసీ ఈ అంశంపై పునరాలోచించి..డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ విధానం రద్దు చేయలేని యెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.