•  తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు

వేద న్యూస్, ఇల్లందకుంట:

 బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు స్మరించుకున్నారు. 

కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థి అన్నం ప్రవీణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చిన్నతనం నుంచే అసమానతలు అవమానాలు ఎన్నో ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన దళితరత్నం అని కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దళిత సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి దళితులందరికీ విముక్తి కలిగించడానికి నిత్యం పోరాటం చేసిన దళిత మేధావి  అని చెప్పారు.

27 ఏళ్ల వయసులోనే ఒక ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులు చేపట్టి ఎమ్మెల్యే నుంచి ఉప ప్రధానమంత్రి వరకు దేశానికి గొప్ప సేవలందించిన చిరస్మరణీయుడు బాబు జగ్జీవన్ రామ్  అని వెల్లడించారు. 

దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా పనిచేసి ప్రపంచ రికార్డు తన సొంతం చేసుకున్న గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో బాబు జగజీవన్ రావు కు ఆ గౌరవం దక్కిందని అన్నం ప్రవీణ్ కొనియాడారు. అసమానతలు రూపుమాపడంలో సమన్యాయం కోసం జనమందరినీ చైతన్య పరుస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్  ఆలోచనలు మేదోశక్తి ఇప్పటి విద్యార్థులు యువకులు ఆచరించి సమ సమాజ బాగు కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దోహదపడాలని పాటుపడాలని  ఆకాంక్షించారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి , తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్ , పెద్ది కుమార్, వంగ రామకృష్ణ , మేకల సురేష్ , రాజేశం సంతోష్ , రఘు బాబు కుమార్ , అజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.