• గ్రామపంచాయతీ ఆఫీసును ప్రారంభించిన ఆఫీసర్ కేవీ రంగాచారి

వేద న్యూస్, హన్మకొండ:

దామెర మండలకేంద్రంలో మండల పంచాయతీ అధికారి కే వీ రంగాచారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి శనివారం మార్చారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పంచాయతీ సెక్రెటరీ నరేష్ కోరారు.

 ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ అవసరాలు, పనుల నిమిత్తం పీహెచ్ సీ భవనంలో కొనసాగుతోన్న ఆఫీసుకు రావాలని పంచాయతీ సెక్రెటరీ ఇంజపల్లి నరేశ్ సూచించారు. గ్రామస్తులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, నాయకులు భిక్షపతి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

పీహెచ్‌సీ భవనంలో జీపీ: సెక్రెటరీ నరేశ్