వేద న్యూస్, హన్మకొండ:

సాధారణ బదిలీల్లో భాగంగా దామెర మండలకేంద్రం, జీపీ పంచాయతీ సెక్రెటరీగా ఉన్న ఇంజపెల్లి నరేశ్..దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒగ్లాపూర్ కు బదిలీ అయిన ఉత్తర్వులను పంచాయతీ రాజ్ శాఖ అధికారి పంచాయతీ సెక్రెటరీ నరేశ్ కు అందజేశారు. 

దామెర వాసులు ప్రతి ఒక్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు..
దాదాపు గత ఐదేండ్లు తనకు పంచాయతీ సెక్రెటరీగా విధి నిర్వహణలో సహకారం అందించిన దామెర గ్రామ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ స్థాయి ఉద్యోగులు అంగన్ వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల వీవోఏలు, డీలర్లు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామ ప్రజలు అందరికీ ఇంజపెల్లి నరేశ్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.