వేద న్యూస్, వరంగల్:

నాలుగేండ్ల సర్వీసు పూర్తి అయినందున దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) దామెర రజితను  పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4గా నియమిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వృత్తినే దైవంగా భావిస్తూ.. విధి నిర్వహణలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేసీ జేపీఎస్ నుంచి గ్రేడ్-4 హోదా పంచాయతీ కార్యదర్శిగా దామెర రజిత ఉద్యోగోన్నతి పొందడం పట్ల గ్రామస్తులు, సహోద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని పలువురు గ్రామస్తులు ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా రజితకు హనుమకొండ జిల్లాపంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి ఇంజపెల్లి నరేశ్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీ అర్థం శ్రీనివాస్,పరకాల డివిజన్ అధ్యక్షులు మనోహర్, కార్యదర్శులు వేణు మాధవ్, సరళ,రామ్మూర్తి, సందీప్, మణిదీప్,కవిత,ధర్మా రెడ్డి,సిరి వెన్నెల,కవిత,పద్మ, అమిత లు శుభాకాంక్షలు  తెలిపారు.