• బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్

వేద న్యూస్, ఆసిఫాబాద్:
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం లోని మాలాన్ గొంది కొలం గూడా లో దండారి పండుగల వేడుకల‌లో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆవిడపు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీల పూజలలో పాల్గొని..దండారి వేడుకల్లో గుస్సాడి లతో కలిసి ఆదివాసీలా సంప్రదాయ నృత్యం చేశారు.

ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనం దండారి అని చెప్పారు. ఈ దండారి పండుగ చాలా విశేషమైనదని తెలిపారు. ఈ పండుగను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఈనాటి యువత మీద ఉన్నదని స్పష్టం చేశారు.

దీపావళి పండుగ ఆదివాసీలకి ప్రత్యేకమైనదిగా భావిస్తారని..వారు పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్రకృతితో మమేకమై పండుగని నిర్వహిస్తారని వెల్లడించారు. కార్యక్రమం లో కొలం సంఘం రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆత్రం తిరుపతి, కొలం సంఘం నాయకులు టెకం రమేష్, టెకం భీంరావు, గ్రామ పటేల్ టెకం భీము పటేల్, టెకం చిన్ను, లేతు తదితరులు పాల్గొన్నారు.