- ఆ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి మనోహర్ రెడ్డి ధీమా
వేద న్యూస్, ఎలిగేడు:
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కళ్యాణ లక్ష్మి ,షాద్ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, రైతులను ఆదుకోవడంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని జనానికి అర్థమయ్యేలా వివరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.