వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో భారత రెండో ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని ఘనంగా గురువారం నిర్వహించారు. ఎల్బీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి..కళాశాల ప్రాంగణంలో శాస్త్రి కాంస్య విగ్రహాన్ని పూలతో అలంకరించి..పూలదండ వేసి నివాళులర్పించారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు దేశ సైన్యాన్ని, దేశంలోని రైతులను ఆదుకోవాలని ఒక్క రేడియో ప్రసంగం భారతజాతిని ఏకతాటిపై తీసుకొచ్చిన మహానేత శాస్త్రి అని కొనియాడారు. భారతదేశం కష్టాల నుంచి బయట పడుతుందన్న ప్రసంగం ‘‘జై జవాన్ జై కిసాన్’’ నినాదం ఇంకా కొట్లాదిమంది ప్రజల్లో సజీవంగా ఉందని పేర్కొన్నారు. లాల్ బహూదర్ శాస్త్రి సేవలను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్సిసి క్యాడేట్స్ పాల్గొన్నారు.