• విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్
  • స్పందన ఆశ్రమ పిల్లలతో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

వేద న్యూస్, జమ్మికుంట:
డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజని విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు శనివారం జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథాశ్రమ పిల్లలతో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నం మాట్లాడుతూ ఆశ్రమ పిల్లలతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిన సంగతి గుర్తుచేశారు.

సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమైనా ..ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. సోనియా గాంధీ ఆలోచనలతో ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తోందని స్పష్టం చేశారు.

తెలంగాణ సమాజం తలెత్తుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్, విద్యార్థి నాయకులు బుడిగె శ్రీకాంత్, బిజిగిరి శ్రీకాంత్, యేబూషీ అజయ్, ఇటుకాల గణేశ్, పొనగంటి కార్తీక్, బోనగిరి అంజి, కడియాల విఘ్నేశ్, కానవేని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.