• జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు

వేద న్యూస్, మందమర్రి:

ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ తదితర ఆరోగ్య అంశాలపై ఏఎన్ఎం లకు, ఆశ లకు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలందరికీ సరైన సమయానికి సరైన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఫయాస్ ఖాన్, పట్టణ వైద్యాధికారి డాక్టర్ రమేష్, సిహెచ్ఓ కే గంగాధర్, ఎంఎల్హెచ్పీ లు, ఏఎన్ఎం లు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.